ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో బిగ్ షాక్
NEWS Jul 11,2025 11:29 am
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది హైకోర్టు. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల లోపు ఇంజినీరింగ్ ఫీజులను నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.