ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పాపికొండలు విహార యాత్రకు బ్రేక్ పడింది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. విహార యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.