ఏసీబీకి చిక్కిన సైబరాబాద్ ఎస్ఐ
NEWS Jul 11,2025 04:50 am
ఏసీబీ దూకుడు పెంచింది. రోజూ ఎక్కడో ఒక చోట అవినీతికి పాల్పడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. సైబరాబాద్ గచ్చిబౌలిలోని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పని చేస్తున్న వేణుగోపాల్ ఫిర్యాదుదారుడి నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. పోలీస్ స్టేషన్ లో బాధితుడి తల్లిపై నమోదైన కేసులో పేరు తొలగించేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎవరైనా లంచం ఇవ్వాలని కోరితే వెంటనే తెలంగాణ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఫోన్ చేయాలని కోరారు ఏసీబీ చీఫ్.