కుల వృత్తుల వారికి సన్మానం
NEWS Jul 10,2025 06:21 pm
గురుపూర్ణిమ సందర్భంగా కులవృత్తులు నిర్వహించే వారిని గుర్తించి శ్రీ స్వామి వివేకానంద సేవ సమితి అధ్వర్యంలో సత్కరించారు. ఆత్మకూరులోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది నారాయణ గౌడ్ పాల్గొన్నారు. స్వామి వివేకానంద సేవాసమితి, ఆత్మకూరు అధ్యక్షులు బాలు, కార్యదర్శి శ్రీనివాసులు, సంతోష్ కుమార్, టీచర్ పాల్గొన్నారు. వివేకానంద జూనియర్ కళాశాల అధినేత రేచింతల శ్రీనివాస్ కు వివేకానంద సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.