ఐపీఎల్ మెగా టోర్నీలో చోటు చేసుకున్న టికెట్ల దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించినట్లు సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు మల్కాజిగిరి కోర్టులో నివేదిక సమర్పించింది.