'సీఎంను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు'
NEWS Jul 10,2025 06:52 pm
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. ఆఫ్ట్రాల్ నువ్వు ఎమ్మెల్యేవి మాత్రమేనని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే స్థాయి నీకు లేదన్నారు. ఛాలెంజ్ చేయాలంటే ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ చేయాలన్నారు. నీకు దమ్ముంటే నీ తండ్రి వద్ద నుంచి ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలని సవాల్ విసిరారు.