ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న కేసీఆర్
NEWS Jul 10,2025 08:19 pm
మాజీ సీఎం కేసీఆర్ వైద్యుల సూచనల మేరకు గురువారం మరోసారి యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆస్పత్రి నుండి నందినగర్ లోని తన నివాసానికి బయలు దేరి వెళ్లారు. కేసీఆర్ వెంట సంతోష్ రావు, కేసీఆర్ భార్య శోభ ఉన్నారు. తన ఆరోగ్యం పదిలంగానే ఉందని, ఎప్పటి లాగే పరీక్షలు చేయాల్సి రావడంతో ఆస్పత్రికి వచ్చారని తెలిపారు ఆస్పత్రి యాజమాన్యం.