గిద్దలూరులో ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి చేప
NEWS Jul 10,2025 11:54 pm
గిద్దలూరు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయడానికి రూ. 35000 లంచం తీసుకుంటూ సబ్ రిజిస్టర్ కృష్ణమోహన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అవినీతికి పాల్పడే అధికారులకు శిక్ష తప్పదని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.