బీజేవైఎం మండల అధ్యక్షులుగా అరె శివ
NEWS Jul 10,2025 11:53 pm
కథలాపూర్ మండల బీజే యువ మోర్ఛా అధ్యక్షునిగా చింతకుంట గ్రామానికి చెందిన ఆరే శివను నియమించినట్లు కథలాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు మారుతి తెలిపారు. తన నియామకానికి సహకారాన్ని అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపీ, వెంకటేశ్వరరావు, కోడిపెల్లి గోపాల్ రెడ్డి, వినోద్ రెడ్డి, బండ అంజయ్య, గాంధారి శ్రీనివాస్, సత్యనారాయణలకు శివ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తానని శివ అన్నారు.