లిక్కర్ స్కాం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ కు నోటీస్
NEWS Jul 10,2025 05:34 pm
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసును పర్యవేక్షిస్తున్న సిట్ రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవకు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విజయవాడలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత జగన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకమైన శాఖలను రజత్ నిర్వహించారు. లిక్కర్ టెండర్ , ధరల నిర్ణయం, వైన్స్ షాపుల కేటాయింపు, తదితర వాటిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారని సిట్ పేర్కొంది. కూటమి సర్కార్ వచ్చాక సిట్ ను ఏర్పాటు చేసింది లిక్కర్ స్కామ్ పై.