CM రేవంత్ రెడ్డికి కవిత సవాల్
NEWS Jul 10,2025 05:12 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మహిళలందరితో కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదేపదే కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని కోరడాన్ని ప్రస్తావిస్తూ, తాము చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాల్ చేశారు.