కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన ప్రకటన చేశారు. ఐదేళ్ల వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అన్నారు. ఇందులో మార్పు అనేది ఉండదన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌కు సీఎం అవ్వాలని ఆశ ఉంది కానీ, 2028 ఎన్నికల వరకు నేనే సీఎంగా ఉంటానన్నారు. ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారి తీసింది.