బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ను వదిలేస్తే ఎలా..?
NEWS Jul 10,2025 04:47 pm
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో 29 మంది సెలిబ్రిటీలు, ప్రముఖులపై ఈడీ కేసు నమోదు చేయడం పట్ల స్పందించారు. ఇదే యాప్స్ ను ప్రమోట్ చేసిన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉన్నందుకు వాళ్లను వదిలి వేశారా అని నిలదీశారు. మీతో కలిస్తే కేసులుండవు కలవక పోతే కేసులు నమోదు చేస్తారా..ఇదేనా మీ దేశం కోసం ధర్మం కోసం నినాదం అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.