చేనేతలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వినతి
NEWS Jul 10,2025 11:55 pm
నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో నివసిస్తున్న చేనేత కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని టీయుసిఐ , సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నేతలు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. మాస్ లైన్ పార్టీ పట్టణ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఏళ్ల క్రితం చేనేత కార్మికులకు గాంధీనగర్ కాలనీలో అప్పటి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిందని, నేటికి వాటికి సంబంధించిన పట్టాలు ఇవ్వలేదని కలెక్టర్ సృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కారానికి అధికారులను ఆదేశిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.