విద్యా రంగంలో కీలక మార్పులకు శ్రీకారం
NEWS Jul 10,2025 02:54 pm
విద్యా రంగంలో కీలకమైన మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. విద్యాభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతోందన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ 2.0ను అద్భుత కార్యక్రమంగా అభివర్ణించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు, నాణ్యమైన చదువుల కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. చిన్నారుల్లో విద్యతో పాటు ఇతర రంగాల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలని పిలుపునిచ్చారు.