మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్
NEWS Jul 10,2025 02:36 pm
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకుండా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని తనపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణకు హాజరు కాక పోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది.