స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి
NEWS Jul 10,2025 11:56 pm
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో నారాయణపేటలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేయాలని, కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని అన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.