సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు లేఖ రాశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీ లకు కూడా 40 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల లాగే ఎంపీలు కూడా ప్రజల చేత ఎంపికైన ప్రజా ప్రతినిధులేనని, పార్టీలకు అతీతంగా 17 మందికి అవకాశం కల్పించాలని కోరారు.