ఒంగోలులో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
NEWS Jul 10,2025 12:20 pm
ఒంగోలులో గురుపూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంతపేటలోని సాయిబాబా మందిరం, లాయరు పేటలోని సాయిబాబా మందిరాలలో భక్తులు విశేష పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరాలను అందంగా అలంకరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి బారులు తీరారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు.