స్కూళ్ల అభివృద్ధికి దాతలు సహకరించాలి
NEWS Jul 10,2025 12:24 pm
వెలిగండ్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ గుంటక తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వ సాయంతో పాటు దాతల సహకారం అవసరమన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.