చంద్రబాబూ.. మద్దతు ధర మాటేంటి.?
NEWS Jul 10,2025 06:43 am
రాష్ట్రంలో రోజు రోజుకు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మామిడి రైతులు కనీసం రూ. 16 చెల్లించాలని కోరుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కూటమి ప్రొడక్షన్ లో, పోలీసు శాఖ సెట్టింగ్ లో, బంగారుపాళ్యం YCP మామిడికాయ సినిమాను రక్తి కట్టించారంటూ ఎద్దేవా చేశారు. ఎవరిని ఫూల్స్ చేసేందుకని పరామర్శలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.