గురుపౌర్ణమి వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యే
NEWS Jul 10,2025 12:16 pm
కనిగిరిలోని శిరిడి సాయిబాబా దేవస్థానంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధ్యక్షులు కొప్పవరపు సత్యాలు ఎమ్మెల్యే, ఎంపీలను ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.