పామూరులో ఘనంగా గురు పౌర్ణమి
NEWS Jul 10,2025 12:19 pm
గురుపౌర్ణమి పురస్కరించుకుని పామూరు సాయిబాబా దేవస్థానంలో సీఐ భీమా నాయక్, ఎంపీడీవో బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి అరవింద ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయిబాబా దేవస్థాన పాలక మండలి సభ్యులు ఆలయ ప్రాంగణంలో కోలాటం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.