వైభవంగా గురు పూర్ణిమ మహోత్సవం
NEWS Jul 10,2025 12:12 pm
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక సాయి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఆత్మకూరు శ్రీ సాయిబాబా మందిరంలో గురుపూర్ణిమ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం గణపతి, సందీశ్వర, సంతాన నాగదేవత.. సద్గురువులైన శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ షిర్డీ సాయిబాబాలకు పంచామృత అభిషేకములతో పాటు విశేష పూజలు భక్తులచే చేయించి భక్తులను ఆనందింపజేశారు. ఈ కార్యక్రమానికి వేలాది భక్తులు హాజరై దత్తాత్రేయుని షిరిడి సాయి ఆశీస్సులు పొందారు.