ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన
NEWS Jul 10,2025 09:47 am
ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటన ముగిసింది. ఆయన 8 రోజుల పాటు 5 దేశాలలో పర్యటించారు. 3 దేశాల నుంచి ఆయన అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇదే సమయంలో బ్రెజిల్ లోని రియో డిజెనిరో వేదికగా జరిగిన బ్రిక్స్ సర్వ సభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత దేశం శాంతిని తప్ప యుద్దాన్ని కోరుకోదన్నారు. ఒకవేళ కావాలని కయ్యానికి కాలు దువ్వితే తగిన రీతిలో బుద్ది చెబుతామన్నారు.