కపిలేశ్వర ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
NEWS Jul 10,2025 09:29 am
తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా యాగశాల పూజ, హోమం, మహా పూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టు పవిత్ర సమర్పణ చేపట్టారు. మధ్యాహ్నం అభిషేకం, అలంకారం, సహస్ర నామార్చన నిర్వహించారు. శ్రీ వినాయక స్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్య స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థ ప్రసాదాలు అందజేశారు.