గిద్దలూరులోని అగ్నిమాపక కేంద్రం ఎదురుగా ఉన్న బోరు నుంచి నిత్యం వృధాగా పోతోంది. గురువారం నీరు వృధాగా కాలువలో కలుస్తున్నా అటు అగ్నిమాపక శాఖ అధికారులు కానీ, ఇటు నగర పంచాయతీ అధికారులు కానీ ఎవరూ స్పందించలేదు. అసలే జూన్ లో లోటు వర్షపాతంతో భూగర్భ జలాలు పశ్చిమ ప్రకాశంలో అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రతి నీటిబొట్టు ఎంత విలువైనప్పటికీ అధికారులు నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి