ఎలాన్‌మస్క్‌కు షాక్..ఎక్స్ సీఈవో లిండా రిజైన్
NEWS Jul 10,2025 03:58 am
టెస్లా, ఎక్స్ చైర్మన్ ఎలాన్‌మస్క్‌కు బిగ్ షాక్ తగిలింది. గత రెండేళ్లుగా సీఈవోగా విశిష్ట సేవలందిస్తూ వచ్చిన లిండా యాకారినో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో మైక్రో బ్లాగింగ్ సంస్థగా ఎక్స్ గుర్తింపు పొందింది. కోట్లాది మంది ఇందులో తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకునే అవకాశం కల్పించారు. ఎక్స్ ను ప్రపంచ వ్యాప్తంగా మరింత దగ్గరయ్యేలా చేయడం, టెక్నాలజీ పరంగా కీలక మార్పులు తీసుకు రావడంలో, జనాదరణ పొందేలా చేయడంలో లిండా కీలక పాత్ర పోషించారు. కాగా తాను ఎందుకు తప్పుకుంటున్నాననే విషయంపై వివరణ ఇవ్వలేదు.