వేగంగా నిండుతున్న నాగార్జున సాగర్
NEWS Jul 10,2025 02:18 am
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో నాగార్జున సాగర్ జలాశయం వేగంగా నిండుతోంది. ఇన్ ఫ్లో 1,17,868 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 4,646 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుతం 536.90 అడుగుల వద్దకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 181.9292 టీఎంసీలుగా ఉంది.