కొనసాగుతున్న వరద.. శ్రీశైలం కళకళ
NEWS Jul 10,2025 02:20 am
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి కిందకు నీటిని వదిలారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,81,051 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,47,939 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్లం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగుల వద్ద నీరు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.1205 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం నీరు సమృద్దిగా ఉండడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.