సైకిల్ నడిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
NEWS Jul 09,2025 10:15 pm
అతి తక్కువ ఖర్చు, బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రాజాపు సిద్ధూను అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపమిచ్చిన విద్యార్థిని మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్ ని స్వయంగా నడిపారు. ఈ సందర్బంగా తనకు రూ. లక్ష ప్రోత్సాహకం అందించారు.