కేసీఆర్ కోరుకుంటే నేను కూడా వస్తా
NEWS Jul 09,2025 10:12 pm
సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల ఫ్యామీలీ సమస్యలు ఉంటే మీరు చూసుకోవాలని , వీధి బాగోతాలు మంచివి కావన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదంటే, తారీఖు చెబితే మా మంత్రులంతా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వస్తారన్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామన్నారు. కేసీఆర్ కోరుకుంటే ఎర్రవల్లిలో జరిగే ప్రజా ప్రతినిధుల సమావేశానికి తాను కూడా వస్తానన్నారు.క్లబ్బులు, పబ్బులు అంటేనే ఇబ్బంది కలుగుతుందన్నారు. ప్రజాభవన్ గడి కాదు, ఇక్కడ ధర్మగంట ఎవరైనా కొట్టవచ్చన్నారు.