ఆత్మకూర్ ఎస్ఐగా హిమబిందు రాథోడ్
NEWS Jul 10,2025 01:16 am
ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-2గా హిమబిందు రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. వనపర్తిలో ట్రైనీ ఎస్సైగా పనిచేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. సీఐ శివకుమార్, ఎస్ఐ నరేందర్, స్టేషన్ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతి భద్రతలను కాపాడటంలో తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హిమబిందు తెలిపారు.