యార్లగడ్డకు కేంద్రం అరుదైన గౌరవం
NEWS Jul 09,2025 09:08 pm
ఏపీకి చెందిన ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు కీలక పదవి అప్పగించింది కేంద్ర సర్కార్. సంయుక్త హిందీ సలహా సమితిలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను సభ్యునిగా నియమించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఛైర్మన్‌గా, సహాయ ఆర్థిక మంత్రి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. విభిన్న కేంద్ర శాఖలైన రెవెన్యూ, ఖర్చు, పెట్టుబడి, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయాల పరిపాలనలో హిందీ భాషా వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం.