భద్రాచలం ఈవోపై దాడి అప్రజాస్వామికం
NEWS Jul 09,2025 03:36 pm
చిల్కూరు ఆలయ ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ఈవో రమాదేవిపై దాడికి దిగడాన్ని తప్పుపట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా తాము ఆలయాల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉన్నామని పేర్కొన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉందన్నారు. శ్రీ భద్రాచల రాముల వారికి చెందిన భూములను గుర్తించి, తిరిగి స్వాధీనం చేసుకుని, వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.