రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియామకాలు పూర్తి అయ్యాయని అన్నారు. త్వరలో జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగబోతుందన్నారు. పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తల భవిష్యత్ విషయంలో మాధవ్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారని, ఆ నమ్మకం తనకు ఉందన్నారు.