విత్తన శుద్ధితో చీడపీడలను నివారించవచ్చు
NEWS Jul 11,2025 05:27 pm
కనిగిరి మండలం చల్లగిరగల, తుమ్మకుంట గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి షేక్ జైనులాబ్దిన్ బుధవారం నిర్వహించారు. పంటలు చీడ పీడల బారిన పడకుండా రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలన్నారు. పచ్చి రొట్టె ఎరువులు సాగు చేయడం వల్ల భూమి సారవంతమవుతుందన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించాలన్నారు. మండల పశువు వైద్యాధికారి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.