గుజరాత్ ఘటనపై కవిత విచారం
NEWS Jul 09,2025 02:57 pm
గుజరాత్‌లోని మహీసాగర్‌పై ఉన్న గంభీర వంతెన కుప్పకూలి 10 మంది మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మోర్బీ దుర్ఘటన తర్వాత కూడా గుజరాత్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లోనే ఇలా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో కేంద్ర సర్కార్ సమాధానం చెప్పాలన్నారు.