ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేసిన మంత్రి
NEWS Jul 09,2025 03:12 pm
ఉట్కూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇంటిని ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని మభ్య పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి ఇండ్లు ఇస్తుందని, దశలవారీగా డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయని.. ఇది తన హామీ అని మంత్రి అన్నారు.