తుంగభద్ర డ్యాంకు పోటెత్తిన వరద
NEWS Jul 09,2025 11:31 am
తుంగభద్ర డ్యామ్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1624.80 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 51,150 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 52,685 క్యూ సెక్కులు ఉంది. నీటి మట్టం 105 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 75.837గా ఉంది. ఈ సందర్బంగా నదీ పరివాహక ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు డ్యామ్ అధికారులు.