రాష్ట్ర విభజన కంటే జగన్ వల్లే అధిక నష్టం
NEWS Jul 09,2025 10:58 am
మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ఏపీ విభజన కంటే తన హయాంలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగమం దగ్గర జలహారతి నిర్వహించారు.రూ. 1300 కోట్లతో పట్టిసీమను నిర్మిస్తే దానిని వట్టిసీమ అంటూ ఎద్దేవా చేశాడని, అందుకే జనం ఛీ కొట్టారని, 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. శ్రీశైలం, ధవలేశ్వరం మరమత్తులు, నిర్వహణ కోసం రూ 350 కోట్లు నిధులు కేటాయించిన ఘనత తమ కూటమి సర్కార్ కే దక్కుతుందన్నారు.