తనపై అనుచిత కామెంట్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. బేషరతుగా తను క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి ఇలాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చెప్పాలన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. తన ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాను చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే తనను టార్గెట్ చేశాడని ఆరోపించారు.