సాంకేతిక సాయంతో భక్తులకు దర్శనం
NEWS Jul 09,2025 02:42 am
టీటీడీ ఈవో జె.శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో శ్రీవారి భక్తులకు నిర్దేశించిన సమయానికి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు ఆలస్యంగా రావడం, రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. దీనిని నివారించేందుకు గానూ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని త్వరగా దర్శనం అయ్యేలా చేస్తామన్నారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.