శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
NEWS Jul 09,2025 02:31 am
ఎగువనుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నాలుగు గేట్లను ఎత్తి కిందకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగుల వద్ద ఉంది. ప్రస్తుతం 199.74 టీఎంసీల నీరు ఉండగా ఇన్ ఫ్లో 2,13,284 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,72,511 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయిలో నీళ్లు చేరడంతో శ్రీశైలం కుడి , ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.