టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు నివేదిక సమర్పించారు విజిలెన్స్ అధికారులు. ప్రతి వారం రాజశేఖర్ బాబు పుత్తూరు చర్చిలో ప్రార్థనలు చేస్తున్నట్లు గుర్తించారు. పూర్తి నివేదిక ఆధారంగా రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేశారు ఈవో శ్యామలరావు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా వెల్లడించింది.