మల్లన్న సన్నిధిలో సీఎం చంద్రబాబు
NEWS Jul 08,2025 12:12 pm
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్, మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా స్వామి వారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. దేవాలయాల అభివృద్దికి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. నిత్యం అన్న ప్రసాదం జరుగుతూనే ఉండాలన్నారు.