యూరియా కొరత లేకుండా చూడండి
NEWS Jul 08,2025 11:57 am
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిశారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు. మరింత సరఫరా పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. సీఎం చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటామని, చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు కేంద్రమంత్రి.