ప్రసన్న కామెంట్స్‌పై అచ్చెన్న ఆగ్రహం
NEWS Jul 08,2025 11:56 am
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మంత్రి అచ్చెన్నాయుడు. వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడం సభ్యత కాదన్నారు. బూతులు తిడుతూ మాట్లాడబట్టే 2024 ఎన్నికల ఫలితాల్లో 11 సీట్లకే పరిమితం అయ్యారని, అయినా బుద్ది రావడం లేదన్నారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి బాటలోనే మిగతా నేతలు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాగే కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు.