సీఎం చంద్రబాబుతో కనిగిరి ఎమ్మెల్యే భేటీ
NEWS Jul 08,2025 01:55 pm
సీఎం చంద్రబాబును కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో పలు పెండింగ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మాణానికి నిధులు, రహదారుల నిర్మాణం వంటి పలు అంశాలను చంద్రబాబుకు విన్నవించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.