రేపైనా సీఎం రేవంత్ చర్చకు రావాలి
NEWS Jul 08,2025 12:22 pm
తాను విసిరిన సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి రేపైనా చర్చకు రావాలని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో మోసపూరిత పాలన జరుగుతోందన్నారు. రైతులను, మహిళలను, అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్ దేనని పేర్కొన్నారు.18 నెలలుగా కాంగ్రెస్ అరాచకాలను ఎండ గడుతున్నామన్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టమని అడిగామన్నారు. ఎందుకు చర్చకు రాకుండా ఢిల్లీలో ఉన్నాడో చెప్పాలన్నారు కేటీఆర్.